
ఈ పిచ్చి బ్లాగులోడి వీర బ్లాగుడు ఒక సాయంకాలం మొదలైంది.
మొదలైతే ఐంది కానీ ఏ దారి వెంట వెళ్తుందో తెలీదు.
ఎలా వెళ్తుందో ఐడియా లేదు.
అసలెళ్తుందని గ్యారెంటీ లేదు.
ఎలాగో పట్టాలెక్కింది కావున , కొన్ని జరగొచ్చు.
సాయం కాలం కదా..! చీకటి తరమొచ్చు.
పున్నమైతే వెన్నెల కురియొచ్చు.అది మరోటైతే మూగ పోవొచ్చు.
విషయముంటే వుపన్యాసాలుండొచ్చు.లెకపొతే తీరిక లేదనొచ్చు.
సో, ఎల్లలు లేని మన బ్లాగరికంలో ఏమైనా జరగొచ్చు.
దేశ బ్లాగర్లందు తెలుగు బ్లాగర్లు వేరయా,
విశ్వ జాలాది రామ వినుర మామ.
చివరిగా ఒక మాట.అందరి లానే, మెచ్చుకోళ్ళకు వoదనం. వెక్కిరింతలకు ఆహ్వానం.